బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, August 18, 2018

బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”!

TIRUMALA SRI BALAJI


శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి” దివ్యచరిత్ర!            

ప్రతీరోజు లక్షలాదిమంది భక్తులు వివిధ మార్గాల ద్వార తిరుమల చేరుకోవడంఏడుకొండలవాడ...వెంకటరమణా..గోవిందా...గోవింద...”, ఆపదమొక్కులవాడా వెంకటరమణా...గోవిందా...గోవింద...అని గొంతు చించుకొని తమ శక్తి కొలది భక్తిని చాటుకొని, ఆ దేవాది దేవుణ్ణి దర్శించేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతో సమయం ఓపిగ్గా ఎదురుచూసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు పడిగాపులు కాస్తుంటారు.

అలాంటి దేవాదిదేవుడు, బ్రహ్మాండనాయకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిదివ్యచరిత్రను తెలుసుకోవాలంటే  వరహయుగం కాలం నుండి జరిగిన విషయలను తెలుసుకోవాలి. వరహకాలంలో ఆదివిష్ణువు భూమిని రాక్షసరాజైన హిరణ్యాక్షుడి నుండి రక్షించేందుకు వరాహావతారంలో వచ్చారు. అరివీరభయానకంగా పొడవాటి దంతాలతో అదివరహావాతారంలో  వచ్చిన ఆ శ్రీహరి, అప్పటికే భూమిని హిరణ్యాక్షుడు నీటి అడుగులో దాచి పెట్టడంతో తన పొడవాటి దంతాలతో భూమిని పైకి లేపి రాక్షసరాజైన హిరణ్యాక్షుడితో భీకర సంగ్రామం చేశారు. ఈ సంగ్రామంలో హిరణ్యాక్షుడిని ఆ శ్రీహరి వధించారు. రౌద్రరూపంలో నున్న ఆదివరాహమూర్తిని శాంతింప చేసేందుకు బ్రహ్మాది దేవాదిదేవతలు కీర్తనలతో శ్రీహరిని స్తుతించి, తిరిగి భూమిని యధాస్థానానికి చేర్చమని ప్రార్ధించారు. ఆ మహావిష్ణువు అట్లే చేస్తూ బ్రహ్మని భూమిపై పునఃశృష్టి చేయమని ఆదేశిస్తూ, ప్రజలని కాపాడేందుకు తానూ భూమిపైనే అవతరిస్తానని పేర్కొన్నారు.  





అంతే కాకుండా శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుక్మంతుడిని వైకుంఠములో నున్న క్రీదాచలపర్వతాన్ని తిరుమలలో చేర్చమని ఆజ్ఞాపించారు. ఈ పర్వతం 13 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి రత్నమణిమకుటాడులతో నిక్షిప్తమై ఉన్నదని చెప్పబడింది. (ఒక యోజనం అనగా  14 కిలోమిటర్లతో సమానం) ఈ పర్వతాన్నే క్రీడాద్రి అని కూడా పిలుస్టారు. ఈ విషయం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. స్వామివారి వాహనమైన గరుక్మంతుడు తన భుజస్కందాలపై క్రీడాద్రి పర్వతాన్ని మోస్తూ తిరుమలలో స్వామి వారి పుష్కరిణి తూర్పు భాగంలో నిర్దేశించిన ప్రాంతంలో చేర్చారు. ఈ ప్రాంతం ఆదివరహవతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువే ఎంపిక చేసారు. స్వామివారి అజ్ఞానుసారం గరుక్మంతుడు తన భుజస్ఖంధాలపై క్రీడాచల పర్వతాన్ని  మోసి తెచ్చారు కనుకనే ఆ పర్వతానికి గరుడాద్రి అని పిలవబడుతోందని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పటికీ కోపోద్రిక్తడై ఉన్న ఆదివరహావతారిని బ్రాహ్మదిదేవతలు స్తుతితో  శాంతరూపుడై తన చతుర్భాజలతో, వజ్రవైఢూర్యాల ఆభరణాలు ధరించి భూదేవి సహితంగా అవతరించారు. అక్కడి నుండి భక్తుల కోర్కెలు తీర్చుటకు వేంకటాద్రిపై కొలువుతీరాలని  నిర్ణయించిరి.





శేషాచలం పర్వత చరిత్ర: 

ద్వాపరయుగంలో ఒకానొక సందర్భంలో, వైకుంఠములో ఆ శ్రీహరి లక్ష్మిదేవితో సరస సల్లాపములో ఉన్నపుడు వాయుదేవుడు వైకుంఠప్రవేశానికి ప్రయత్నించగా ఆదిశేషుడు అడ్డుకుంటాడు. అంతమాత్రముచే కోపోద్రిక్తుడైన వాయుదేవుడు తనతో యుద్దానికి వచ్చి గెలుపొందాల్సిందిగా ఆదిశేషుడిని కవ్విస్తాడు. పవిత్ర మేరు పర్వతంను చుట్టుకున్న ఆదిశేషుని దెబ్బ కొట్టడానికి వాయుదేవుడు ప్రయత్నించాడు. వాయుదేవుడు ఎంత శక్తితో వీచినా ఏమీ సాధించలేకపోయాడు. అయితే ఆదిశేషు ఏమౌతుందో చూద్దామని తన పడగవిప్పి చూచినపుడు వాయుదేవుడు అదును చూచి బలంగా వీచడంతో ఆదిశేషుడు స్వర్ణముఖి నడితీరంలో పడతాడు. ఓటమి భారంతో ధుఃఖిస్తున్న ఆదిషేశుడిని మహావిష్ణువు ఓదార్చి, ఈ పర్వతం శేషాద్రిగా పిలవబడుతుందని అనుగ్రహించారు.

రెండవభాగం                                                              చివరిభాగం


No comments:

Post a Comment