కాణిపాకం వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాలు 2019
ప్రతి సంవత్సరం వచ్చే గణేష్ చతుర్థి నుండి కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవం మొదలవుతుంది. అంటే ఈ సంవత్సరం 2019 సెప్టెంబర్ 2న మొదలై 21రోజుల పాటు అంటే 2019 సెప్టెంబర్ 22 వరకు జరుగుతాయి. ఈ రోజుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి వివిధ రకాలైన వాహనాలపై ఊరేగిపులు జరుపుతారు. భక్తులు, స్థానికులు భక్తిశ్రద్దలతో ఊరేగింపులో పాల్గొని తరిస్తారు. ఇప్పటివరకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు అత్మతృప్తితో పాటూ నిర్వహకుల పట్ల ప్రశంసలను కూడా కురిపించారు. శ్రీ కాణిపాకం వరిసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
శ్రీ కాణిపాకం వినాయక స్వామి వారి వాహన వివరాలు :
- హంస వాహనం.
- నెమలి వాహనం.
- మూషిక వాహనం.
- శేష వాయనం.
- వృషభ వాహనం.
- గజ వాహనం.
ఎలా చేరుకోవాలి?
సుమారు తిరుపతి నుండి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయకుడు. చిత్తూరు జిల్లా ప్రముఖ క్షేత్రం తిరుపతినుండి ప్రతి 15నిముషాలకి బస్సు సౌకర్యం కలదు. తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ పలు బస్సు సర్వీసులను భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తుంది. అంతే కాకుండా కాబ్ సర్వీసులు, ఆటోలు అందుబాటులో ఉన్నవి.
శ్రీశ్రీశ్రీ కాణిపాకం వరసిద్దివినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2018 :
02/09/2019 బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఈరోజు వినాయక చవితితో పాటూ, పుష్ప కావళ్ళు, అభిషేకం, ధ్వజారోహణ నిర్వహణతో పాటూగ్రామోత్సవాలను నిర్వహిస్తారు.
03/09/2019 బ్రహ్మోత్సవాల్లో ద్వితీయ దినమైన ఈ రోజు గ్రామోత్సవ నిర్వహణతో పాటూ హంసవాహనం పై స్వామివారిని ఊరేగిస్తారు.
04/09/2019 తృతీయ దినం నెమలి వాహనంపై ఊరేగింపు మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
05/09/2019 నాల్గవ దినం మూషిక వాహనంపై ఊరేగింపు మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
06/09/2019 ఐదవ దినం శేష వాహనంపై ఊరేగింపు మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
07/09/2019 ఆరవ దినం వృశభ వాహనంపై ఊరేగింపు మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
08/09/2019 ఏడవ దినం గజ వాహనంపై ఊరేగింపు మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
09/09/2019 ఎనిమిదవ రధోత్సవం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
10/09/2019 తొమ్మిదవ దినం భిక్షాంది సేవ, తిరుకల్యాణం, అశ్వవాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
11/09/2019 పదవ దినం ధ్వజారోహణం, వాడయతు ఉత్సవం, ఏకాంత సేవ మరియు గ్రామోత్సవ నిర్వహణ.
12/09/2019 పదకొండవ దినం అధికార నంది వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
13/09/2019 పన్నెండవ దినం రావణ బ్రహ్మ వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
14/09/2019 పదమూడవ దినం యాలి వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
15/09/2019 పద్నాల్గవ దినం సూర్యప్రభ వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
16/09/2019 పదిహేనవ దినం చంద్రప్రభ వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
17/09/2019 పదహరవ దినం విమానోత్సవం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
18/09/2019 పదిహేడవ దినం పుష్పపల్లికీ సేవ మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
19/09/2019 పద్దెనిమిదవ దినం కామధేను వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
20/09/2019 పంతొమ్మిదవ దినం కల్పవృక్ష వాహనం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
21/09/2019 ఇరవైయ్యవ దినం పూలంగి సేవ మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
22/09/2019 ఇరవయ్యొకటవ దినం తెప్పోత్సవం మరియు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.
No comments:
Post a Comment