బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”! - 2వ భాగం - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, August 25, 2018

బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”! - 2వ భాగం



బ్రహ్మాండ నాయకుడు తిరుమల "శ్రీ వెంకటేశ్వర స్వామి"!


లక్ష్మీదేవి వైకుంఠము విడిచిపెట్టుట :

కలియుగంలో కొందరు ఋషులు యజ్ఞం జరపాలని నిర్ణయిస్తారు. యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరు సాత్వికుదో వారికి ఇవ్వాలని తలపోస్తారు. ఇందు నిమిత్తం నారద మహామునిని సంప్రదించగా, త్రిమూర్తులలో ఎవరు సాత్వికుదో భ్రుగుమహర్షి నిర్ణయిస్తారని సెలవిచ్చెను. మూడో నేత్రాన్ని పాదంలో కల్గిన భ్రుగుమహర్షి అహంకారముతో ఉండెను. తొలుత బ్రహ్మ వద్దకు వెళ్తాడు. తన అనుమతి లేకుండా భ్రుగుమహర్షి ఆశీనుడైనందున బ్రహ్మ కోపోద్రిక్తుడై మాటలడకుండా ఉండెను. అంత భ్రుగుమహర్షి కోపోద్రిక్తుడై “ఓరీ! బ్రహ్మ నిన్ను భూలోకమున నీకు పూజలు, పునస్కరములు, దేవాలయములు ఉండవని శపించెను” పిదప శివలోకమునకు వెళ్ళగా శివుడు పార్వతితో ప్రణయ నృత్యము చేస్తూ భ్రుగువు రాకను గమనిచకుందెను. దీనికి ఋషి కోపము చెంది “మహేశ్వరా! మహామునినైన నన్ను నీవు గౌరవించలేదు కనుక నిన్ను భూలోకమున విగ్రహరూపమున పుజించకుందురు గాక. లింగాకార సమర్చన మాత్రమే జరుగును గాక” అని శపించెను. 




పిదప వైకుంఠమునకు వెళ్ళెను. మహావిష్ణువు లక్ష్మీదేవితో సరససల్లాపములో ఉండెను. బృగువు రాకను తెలియకుండెను. ఆగ్రహోదగ్డుడైన బృగువు తనని శ్రీహరి నిర్లక్ష్యము చేసినాదని భ్రమించి వీరభాద్రుడై హూంకరించి విష్ణువు వక్షస్థలముపై తన్నెను. ఆ మహానుభావుని తన్నగానే లోకములన్ని గజ గజ లాడెను, భూదేవి కంపించేను, సముద్రములన్నీ అల్లకల్లోలమాయెను. అయినను ఆ విష్ణువు శాంతముగాను ఉండెను. భ్రుగుమహర్షిని, మహానుభావా మీ పాదములకు నొప్పి కలిగేనేమో అనుచూ పాదములను ఒత్తుచూ మూదోనేత్రమును చిదిమి వేసెను. అంత భ్రుగువునకు గర్వభంగమై హృదయము జ్ఞానరంగమైనది. అంతట భ్రుగువు “ఓ మహానుభావా! భూలోకమున మానవులు పాపాత్ములై సంచరించుచూ ననవిధములిన్ కష్టములను పడుతున్నారు. కావున నీవే అవతరించి ప్రజల కష్టములను తీర్చమని ప్రార్ధించి” భూలోకమునకేగి “త్రిమూర్తులలో ముమ్మాటికి మహావిష్ణువే శాంతముర్త”ని కీర్తించెను.



కాగా వైకుంఠములో భ్రుగువు విష్ణు వక్షస్థలమున కొలువై ఉన్న లక్ష్మిదేవి స్థానమున తన్నుట వలన పరాభవము భరించలేక విష్ణువుతో కలహించి వైకుంఠమును వీడి భూలోకమున కొల్హపురి గ్రామమున స్థిరనివాసిని అయ్యెను.

విష్ణువు వైకుంఠమును వీడుట:

వైకుంఠమును లక్ష్మిదేవి విడిచి వెళ్ళగానే విష్ణువు కళతప్పెను. విచారగ్రస్తుడైన ఆ శ్రీహరి తిరిగి లక్ష్మిని తెచ్చి వక్షస్థలమందు నిలుపుకొను కోరికతో వైకుంఠమును వీడి భూలకమునకేగెను. భూలోకమున లక్ష్మిని వెదుకుచూ అహర్నిశలు శ్రమించెను. మహారన్యములు తిరిగెను. అయిననూ లక్ష్మి జాడ తెలియకుండెను. తిరుగుచూ తిరుగుచూ శేషాద్రి అనే కొండను చేరెను. భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూచెను. అక్కడే ఉండి వారి కష్టనష్టములను తీర్చవలెనని నిశ్చయించుకొనెను. ఒక పెద్ద పుట్టలో తలదాచుకొనెను.




ఆవు పుట్టలో పాలు వదలిన వైనం : చోళరాజు, ఆవులకాపరికి శ్రీహరి శాపం:

శ్రీహరి తలదాచుకున్న పుట్ట చోళుల పరిపాలనలో ఉన్నది. అయితే అప్పటి చోళరాజుకి చెందినా ఆవుల మందని కాపరి రోజూ మేతకి వేంకటాద్రి పర్వతం పైకి తీసుకు వెళ్తుండేవాడు. కాని మందలో ఒక ఆవు ప్రతి రోజూ శ్రీహరి తలదాచుకున్న పుట్ట వద్దకు వెళ్లి తనపొదిలోనున్న పాలన్నీ వదిలేది. ఇదేదీ గమనించని ఆవులకాపరి సమయం మీరేసరికి తిరిగి రాజ్యానికి తీసుకెల్లిపోతుండేవాడు. 

ఇంకా ఉంది...వచ్చే శ్రావణ శనివారం చివరిభాగం లభ్యమవుతుంది!!!

మొదటిభాగం                                                      చివరిభాగం


No comments:

Post a Comment