స్వాతంత్ర్యదినోత్సవ పండగ శుభాకాంక్షలు!
ఎందరో త్యాగధనుల పుణ్యఫలమే నేడు మనమందరం అనుభవిస్తున్న స్వాతంత్రం . అవును మన స్వతంత్ర దినోత్సవ సంబురం నేడే ఆగస్ట్ 15. ఒక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఒక విప్లవ వాది భగత్ సింగ్, ఓ వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి వెన్ను చూపక వీరోచితంగా పోరాడి అసువులు చాలిస్తే. మరొక అహింసావాది, మహాత్ముడు గాంధీ అప్పటి బ్రిటిష్ పాలకులకు అహింస అంటే ఏమిటో చాటిచెప్పి ఆయుధంలేకుండానే వెన్నులో వణుకు తెప్పించారు. అందుకే త్యాగధనులు పుణ్యఫలం మన దేశ స్వాతంత్రం .
అప్పుడే 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. స్వతంత్రం సంగ్రామంలో ఎందరో మహానుభావుల గురించి తెలుసుకొన్నాం. జాతి ప్రయోజనాల గురించి వారు చూపించిన ధైర్యం, తెగువ అందరికి ఆచరనీయమే. ఇప్పటికీ స్వతంత్ర సమర సంగ్రామం గురించి కథలు విన్నప్పుడంతా సామాన్య భారతీయుడి రోమాలు నిక్కబోడుచుకోక మానవు.
ఎప్పటికీ స్వాతంత్రదినోత్సవం ఓ పండగే. జాతి, కుల, మత సామరస్యాన్ని చాటే మన భారతదేశం ఎప్పటికి ఆదర్శప్రాయంగానే అందరికి నిలవాలని, ప్రపంచదేశాల్లో ప్రజాస్వామ్యవ్యవస్థ పరిఢవిల్లాలని “దివ్యక్షేత్రం” మీ అందరికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తోంది.
No comments:
Post a Comment