బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”! - 3వ మరియు చివరి భాగం - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, September 8, 2018

బ్రహ్మాండనాయకుడు తిరుమల “శ్రీ వెంకటేశ్వర స్వామి”! - 3వ మరియు చివరి భాగం

sri venkateswara swamy
శ్రీశ్రీశ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యరూపం!

బ్రహ్మాండ నాయకుడు తిరుమల "శ్రీ వెంకటేశ్వర స్వామి"!

ఒకరోజు రాణి ఆవు ఇవ్వాల్సినపాలని ఇవ్వటంలేదని గమనించింది. ఇదే విషయం ఆవులకాపరికి ఫిర్యాదు చేసింది. ఎప్పట్లానే కాపరి ఆవులమందని కొండపైకి తీసుకువెళ్ళాడు. వేరేగా వెళ్తున్న ఆవుకి అనుసరించాడు. ఆవు ఎప్పట్లానే పుట్ట వద్దకు వెళ్లి పాలని పుట్టలో వదలటాన్ని గమనించిన కాపరి ఆవును నరికెందుకు తన గొడ్డలిని పైకెత్తగానే పుట్టలోంచి శ్రీహరి ఒక్కవుదుటున పైకిలేచి ఆవుని రక్షించారు. గొడ్డలితో కొట్టిన కాపరి శ్రీహరి నుదుటన రక్తం కారుట చూచిన తక్షణమే మరణించెను.

ఎప్పటిలానే తిరిగొచ్చిన ఆవుపై రక్తపు మరకలను చూచిన చోళరాజు తన మందితో కొండపైకి వెళ్ళగా మరణించి పడి ఉన్న కాపరి కనిపించాడు. ఇది ఎలా సంభవించిందో అర్ధంకానీ రాజు అయోమయంలో ఉండగా పుట్టలోంచి శ్రీహరి పైకి వచ్చి కాపరి చేసినతప్పుకి “నీవు అసురుడవు” కమ్మని చోలరాజుని శపించెను.

అంతట కంపించిన చోళరాజు తనకు తెలియకుండా జరిగిన ఈ తప్పుకి క్షమాపణలు కోరగా ఆకాశరాజు కుమార్తె పద్మావతితో తనకు జరిగే వివాహం తరువాత పొందే కిరీటంతో శాపానికి విముక్తి దొరుకుతుందని చెప్పెను. అంతే కాకుండా ఆ శ్రీహరి తనపై గోద్దలినెత్తిన కాపరి ఆత్మకు నీవు మరియు నీ తరాలవారు నా అలయద్వారాలను తెరిచే ఆనందాన్ని పొందగలరని వరాన్నిచ్చెను.





ఆకాశరాజు కుమార్తె పద్మావతితో శ్రీనివాస కళ్యాణము:

శ్రీహరి తలదాచుకున్న పుట్టగల ప్రాంతం చోళుల పరిపాలనలో ఉన్నది. అప్పటి రాజు ఆకాశరాజు. ఆకాశరాజుకి సంతానము లేదు. సంతానము కొరకై యాగము చేయుటకై యాగాభూమిని దున్నుచుండగా నాగలికి ఒక బంగారు పెట్టె దొరికెను. పెట్టెను తెరువగా అందులో ఒక శిశువు ఉండెను. అంతటా ఆకాశరాజు మిక్కిలి సంతోషము చెంది భగవంతుడే ఈ బిడ్డని ఇచ్చెనని తలచి “పద్మావతి”గా నామకరణము చేసెను. ఆమెను పెంచి పెద్ద చేసెను. అంతట పుట్టలోనుంచి వచ్చిన శ్రీహరి వరహాశ్రమములో శ్రీనివాసుడనే నామకరముతో నుండి ప్రజల కష్టసుఖములను ఎరిగి మహిమలు చూపుచుండెను. పద్మావతి శ్రీనివాసుని చూచి మొహించెను. ఆకాశరాజు ఈ శ్రీనివాసుడే ఆ శ్రీహరి అని ఎరిగి తన పద్మావతినిచ్చి వివాహము చేశేను. వివాహమునకు లక్ష్మిదేవీ కొల్హాపురం వీడి వచ్చెను. వివాహము అంగరంగ వైభవముగా జరిగెను.







తొండమానుడు రాజ్యభిషిక్తుడగుట శ్రీవారి అలయనిర్మాణము కావించుట :

ఆకాశరాజు కొన్నాళ్ళకి స్వర్గాస్తుదయ్యేను. అతని తమ్ముడు తొండమానునికి రాజ్యభిషిక్తుడయ్యెను. శ్రీనివాసుడు పద్మావతితో వివాహము తరువాత లక్ష్మి పద్మావతులతో అగస్త్యాస్రమున నివసించెను. అక్కడినుండి కలియుగంతమువరకు ప్రజలను అనుగ్రహించాలని వెంకటాద్రికి వెళ్లి శిలారూపము దాల్చెను. వెంటనే లక్ష్మి, పద్మావతులు కూడా శిలారూపము దాల్చిరి. తొందమానుడా ప్రాంతమునే గొప్ప దేవాలయముగా నిర్మించెను.

తిరుమలలో తల నీలాలు సమర్పించుట వెనుక కథ :


ఆవు పాలు పుట్టలో వదులుతున్న సమయంలో ఆవులకాపరి తన ఆయుధంతో కొట్టి నపుడు శ్రీహరి అడ్డుకోవడం వలన ఆవుకు కావలసిన గాయం శ్రీహరి నుదిటిపై పడినపుడు శ్రీహరికి దెబ్బ తగలటం వలన కొంత కపాల భాగంలో నున్న జుట్టు ఊడిపోయి సుందరాకరం పోయిందని గమనిస్తుంది గంధర్వ యువరాణి నీలాడేవి. శ్రీహరి సుందరాకారం ఏమాత్రం తగ్గరాదని చంద్రునికి మచ్చల ఉన్న ఆ గాయం కనిపించకుండా ఉండాలనే తపనతో యువరాణి నీలాడేవి తన జుట్టులో కొంతభాగాన్ని తీసి  శ్రీహరికి గాయమైన భాగంలో అమరిక చేసింది. అట్లు ఆ శ్రీహరికి తొలిసారి నీలాలు అర్పించిన భక్తురాలైంది నీలాదేవి. సంతసించిన ఆ దేవాదిదేవుడు తన భక్తులు కేశఖందనం ద్వార సమర్పించిన జుట్టు నీకే చెందుతుందని అభిలషించెను. కాబట్టి భక్తులు కేశఖందన ద్వారా సమర్పించిన కేశాలు గంధర్వ రాకుమారి నీలాదేవికి చెందుతున్నట్లుగా భావించబడుతుంది.

మొదటిభాగం                                                                                     రెండవభాగం

No comments:

Post a Comment