![]() |
అమ్మవారికి తెల్ల బంగారం సమర్పిస్తున్న భక్తులు! |
త్వరలో తెలంగాణ లో ప్రముఖ గిరిజన సంప్రదాయ "సమ్మక్క, సారలమ్మల జాతర" 2020 సందడి ప్రారంభం కానున్నది. ఈ అతిపెద్ద గిరిజన సంప్రదాయ ఉత్సవం కోసం మొత్తం భారతదేశం ఎదురు చూస్తోంది. నాలుగు రోజుల పండుగ ను "మేడారం జాతర" అని కూడా అంటారు. "మేడారం" గ్రామం తాడ్వాయి మండలం, వరంగల్ జిల్లా కిందకి వస్తుంది. ఈ స్థలం దండకారణ్యంలో ఒక భాగం.
ఈ మెగా గిరిజన ఫెస్టివల్ మొత్తం తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, దక్షిణ భారతదేశం లో కొన్ని ఇతర భాగాలను ఆకర్షిస్తుంది. గత రికార్డులు ప్రకారం ఈ పండుగ 10 మిలియన్ కంటే ఎక్కువ మందిని (కుంభ మేళ తరువాత అంత ఎక్కువ భక్తులను) దేశవ్యాప్తంగా ఆకర్షిస్తుంది. చాల మంది పెద్దలు “మేడారం జాతరను" మరో కుంభ మేళా గా అభివర్ణిస్తున్నారు.
మేడారం జాతర చరిత్ర :
సమ్మక్క సారలమ్మల జాతర చరిత్రకు చాల కథలు ఉన్నాయ్. ముఖ్యంగా ఇది ఒక తల్లికూతుర్ల అన్యాయానికి, అనాగరిక రాజులపై జరిపిన పోరాటంగా చెప్పుకొంటారు. సమ్మక్క యొక్క అద్భుత శక్తులు గురించి అనేక కథలు ఉన్నాయి. ఒక గిరిజన కథ ప్రకారం కొంతమంది వేటగాళ్ళు ఆహార తీసుకురావడం కొరకు అడవి లోకి వెళతారు. వారు పులులు సమూహం నడుమ ఒక బిడ్డ (సమ్మక్క) ఆడుకోవటం గమనిస్తారు. నవ్వుతో, కాంతి మిణుగురు తో పుట్టిన ఆడ శిశువును వేటగాళ్లు వెంటనే ఆమెను తమ తండాకు తీసుకువెళతారు. తెగ పెద్ద ఆమెను దత్తత తీసుకున్నాడు. కాలక్రమేనా యుక్త వయస్కురాలైన ఆమె తెగ యొక్క రక్షణ బాధ్యతలు స్వీకరించింది. తరువాత ఆమె పగిడిద్ద రాజుని పెండ్లి చేసుకొన్నారు. పగిడిద్ద రాజు, కాకతీయుల ఒక గిరిజన ముఖ్యుడు. సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు వారికి సారక్క, నాగులమ్మ అని మరియు ఏకైక కుమారునకు జంపన్న అని నామకరణం చేసింది.
మేడారం జాతరలో ఆచారాలు :
- సమ్మక్క సారక్క జాతర తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పండుగ. ఒక్క తెలంగాణ రాష్ట్రము నుండే కాకుండా దేశం నలుమూలల నుండి దాదాపు 10 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ సంవత్సరం హాజరు కాబోతున్నట్లు ఒక అంచనా.
- ప్రజలు వారి బరువుకు సమానముగా ఒక పరిణామము బంగారం (బెల్లం) ను మొక్కులు తెరచుకొనే నిమిత్తం దేవతలకు సమర్పిస్తారు. ఈ ఆచారంలో బెల్లాన్ని బంగారంగా భావించటం జరుగుతుంద
- జంపన్న వాగులో పవిత్ర స్నానమాచరించి సమ్మక్క , సారలమ్మలను దర్శించుకొంటారు.
- ఈ మేడారం జాతరలో ఎక్కడ కూడా పురోహితుల అవసరం , ప్రభావం ఉండవు.
జంపన్న వాగు :
జంపన్న వాగు గోదావరి నదికి ఒక వైపు ప్రవాహం. చరిత్ర ప్రకారం, జంపన్న గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. జంపన్న వాగు అతను ప్రవాహంలో కాకతీయ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ వగులోనే పడి మరణించారు. అందుకే ఈ వాగుకి జంపన్న వాగు అనే వచ్చింది.
మేడారం జాతర తేదీలు, 2020:
ఈ సంవత్సరం జాతర ఫిబ్రవరి 5 నుండి మొదలై ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఎప్పటి వలే తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు ప్రారంభోత్సవ వేడుకల కోసం హాజరుకానున్నారు.
మొదటి రోజు (05/02/2020): "మేడారం జాతర" యొక్క ప్రారంభం రోజున కన్నేపల్లి గ్రామం నుండి మేడారం గద్దె వరకు సారలమ్మ రాక కోసం జరుపుకుంటారు. అంతకుముందు పూజారులు కన్నేపల్లి వద్ద అమ్మవారికోసం జరిపే ప్రత్యేక పూజ కోసం యువ పురుషులు మరియు మహిళలు, వివిధ వ్యాధిగ్రస్తులు, పిల్లలు లేని దంపతులు హాజరవుతారు. కన్నేపల్లి గ్రామా ప్రజలు "ఆరతి" నిర్వహింఛి అమ్మవారికి ఘనంగా వేడ్కోలు పలుకుతారు. ఇక్కడ నుండి "సారలమ్మ" "జంపన్న వాగు" మీదుగా మేడారం గద్దె తీసుకువస్తారు. మేడారం గద్దె చేరుకున్నాక సారలమ్మకు భక్తులు పూజలు ప్రారంభిస్తారు.
రెండవ రోజు (06/02/2020): మేడారం జాతర 2 వ రోజున సమ్మక్క రాక సందర్భంగా ఉత్సవం జరుపుకుంటారు. సమ్మక్కకి పోలీసు మరియు ప్రభుత్వం నుండి అధికారిక లాంచనాల నడుమ స్వాగతిస్తారు. సారక్క రాక సందర్భంగా జరిపే “ఎదురుకొల్ల ఘట్టం” ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రోజు పూజారులు వెదురు కర్రలు తీసుకుని గద్దెను అలంకరించి “కుంకుమ భరిణ” ఆకారంలో ఉన్న అమ్మవారిని అలంకరింప చేస్తారు. సాధారణంగా అమ్మవారు చిలకల గుట్ట వద్ద శ్తపిమ్పబడి ఉంటారు. సమ్మక్క చిలకల గుట్ట వద్ద నుండి మేడారం తీసుకువస్తారు. సమ్మక్క రాక సూచనగా, జిల్లా ఎస్పీ (పోలీస్ సూపరింటెండెంట్) గాలిలో మూడుసార్లు తన తుపాకీ కాల్పులు జరపటం ప్రభుత్వ ఆనవాయితీ.
మూడవ రోజు (07/02/2020): మేడారం జాతర 3 వ రోజున, సమ్మక్క సారలమ్మ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. 'జంపన్న వాగు' లో పుణ్య స్నానం జరిపిన తర్వాత, భక్తులు దేవతలని సందర్శించడం పరిపాటి.. భక్తులు సమ్మక్క సారలమ్మలను తమ ప్రార్ధనలతో అర్చిస్తారు. మహిళలు 'ఒడి బియ్యం' (పవిత్ర బియ్యం) మరియు దేవతల 'సారే' (రోజువారీ అంశాల్లో అవసరమైన వస్తువుల కలయిక) సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ మూడవ రోజు నాలుగు పండుగ రోజుల్లో అత్యంత రద్దీగా ఉండే దినం. సమ్మక్క సారక్క జాతర లో ముఖ్యమైన ఆచారం బంగారం '(బెల్లం) సమర్పణ ఉంది. బెల్లం/బంగారం సమర్పణ సమ్మక్క, సారలమ్మల దేవతలని ఆనందింప చేస్తుందని భక్తుల విశ్వాసం.
నాలుగవ రోజు (08/02/2020): మేడారం చివరి రోజైన 4 వ రోజు సమ్మక్క మరియు సారక్క యొక్క వన ప్రవేశం గా జరుపుకుంటారు. లక్షలాది మంది భక్తులు పూజలు చేసుకున్న తర్వాత, సమ్మక్క, సారలమ్మలను తిరిగి అడవిలో వారి స్థానాలకు చేరుస్తారు. ఇది 4 రోజుల సమ్మక్క సారలమ్మ జాతరలో చివరి ఘట్టం. జాతర ప్రారంభంలో అమ్మవార్లను ఎటువంటి ప్రభుత్వ, పోలీస్ లాంచనాలతో తెసుకువచ్చారో అవే లాంచనాలతో చివరి ఘట్టంలో కూడా ఆచరించటం జరుగుతుంది.
No comments:
Post a Comment