తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024. - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, September 28, 2024

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024.

Tiruamal Sri Vari Brahmotsavam Image!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024!

తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి  బ్రహ్మోత్సవాలు అక్టోబర్  03 ఆదివారం సాయంకాలం అంకురార్పణ నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు  హాజరై స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.  ఈ బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలను అంగ రంగ వైభవంగా అలంకరించటంలో తి.తి.దే. విశేష కృషి జరుపుతోంది. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసేందుకు శక్తి మేరకు కృషి చేస్తోంది తి.తి.దే.

హిందూ పంచాంగం (నవరాత్రి / దసరా పండుగకు సమాంతరంగా) ఆశ్వయుజ మాస ప్రారంభంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. 

వార్షిక బ్రహ్మోత్సవాలు (అక్టోబర్ 04) మొదటి రోజు ప్రారంభమయ్యే ముందు సాయంత్రం, "అంకురర్పాన" పూజ  విష్వాక్షేనుని(నారాయణ యొక్క పరిపాలన నాయకుడు) కోసం చేస్తారు. ఈ అంకురార్పన వైశాఖ ఆగమన శాస్త్ర ప్రకారము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ అంకురార్పణ తొమ్మిది రోజుల పండగను సంకల్పిస్తుంది.

మొదటి రోజు, ప్రధాన కార్యకలాపం "ద్వజారోహన," ధ్వజస్తంభంపై గరుడ జెండా ఆవిష్కరిస్తారు. ఇది బ్రాహ్మోత్సవ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా గరుక్మంతుడు దేవలోకానికేగి దేవతల్ని బ్రహ్మోత్సవానికి  ఆహ్వానించడం జరుగుతుందని నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి వివిధ వాహనాల్లో నాలుగు మాఢ  వీధుల్లో రోజూ 9 రోజులపాటు ఊరేగింపులు చేస్తారు. ముగింపు రోజు శ్రీ వెంకటేశ్వర యొక్క జన్మ నక్షత్రం  అవభ్రిత ఉత్సవ (ఉత్సవా మూర్తికి ప్రత్యేక అభిషేకాలు) తో జరుపుకుంటారు. సాయంకాలం  పూజారి సుదర్శన చక్రాన్ని తన తలపై తీసుకొని స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు. తరువాత,చక్రాన్ని  ఒక ప్రత్యేక ఎత్తులోనున్న  వేదిక మీద ఉంచుతారు, భక్తులు దాని క్రింద నడిచి సుదర్శన చక్రం  నుండి జారే నీటిని తలపై పడుతుండగా  భగవంతుని ఆశీర్వచనం పొందినట్లు తన్మయత్యం పొందుతారు. ఈ ఉత్సవం అధికారికంగా "ధ్వజవరొహనం"తో  ఇది గరుడజెండా కాస్త ఎత్తు తగ్గించి ముగింపు (అక్టోబర్ 12) పలుకుతారు. పూజారులు వేదమంత్త్రోఛారాణాలతో  దేవాదిదేవతలు తిరిగి దేవలోకాలకు పయనమవుతారు.

:: వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2024 ::


బ్రహ్మోత్సవం మొదటి రోజు: తేది : 04/10/2024, శుక్ర  వారము.

సాయంత్రం  :   05:45 నుండి 06:00 వరకు ధ్వజారోహణం.
రాత్రి :  09:00 గంటల నుండి 11.00 గంటల వరకు  పెదశేష వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం రెండవ రోజు: తేది : 05/10/2024, శనివారము.

ఉదయం   08:00 నుండి 10:00 వరకు  చిన్నశేషవాహనం.

మధ్యాహ్నం : 01:00 నుండి 03:00 వరకు స్నపన తిరుమంజనం.( ఉత్సవమూర్తికి అభిషేకం ) 

రాత్రి :  07:00 గంటల నుండి 09.00 గంటల వరకు
 హంస వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం మూడవ రోజు: తేది : 06/10/2024, ఆది  వారము.

ఉదయం   08:00 నుండి 10:00 వరకు సింహవాహనం.

మధ్యాహ్నం : 01:00 నుండి 03:00 వరకు స్నపన తిరుమంజనం.( ఉత్సవమూర్తికి అభిషేకం ) 

రాత్రి
 :  07:00 గంటల నుండి 09.00 గంటల వరకు ముత్యపుపందిరి పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం నాల్గవ రోజు: తేది : 07/10/2024, సోమ వారము.

ఉదయం :  08:00 నుండి 10:00 వరకు కల్పవృక్ష వాహనం.

మధ్యాహ్నం : 01:00 నుండి 03:00 వరకు స్నపన తిరుమంజనం.( ఉత్సవమూర్తికి అభిషేకం ) 


రాత్రి :  07:00 గంటల నుండి 09.00 గంటల వరకు సర్వభూపాల వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం ఐదవ రోజు : తేది  08/10/2024,  మంగళ  వారము.

ఉదయం :   08:00 నుండి 10:00 వరకు మోహినీ అవతారం.

సాయంకాలం : 07:00 గంటల నుండి 09.00 గంటల వరకు గరుడ సేవ.

బ్రహ్మోత్సవం ఆరవ రోజు: తేది : 09/10/2024, బుధ  వారము.

ఉదయం :  08:00 నుండి 10:00 వరకు హనుమంత వాహనం.

సాయంత్రం : 04:00 నుండి 05:00 వరకు స్వర్ణ రథోత్సవం.

రాత్రి:  07:00 నుండి 09:00 వరకు గజ వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం ఏడవ రోజు: తేది : 10/10/2024, గురు  వారము.

ఉదయం :   08:00 నుండి 10:00 వరకు సూర్యప్రభ వాహనం.

రాత్రి: 07:00 నుండి 09:00 వరకు చంద్రప్రభ వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం ఎనిమిదవ రోజు: తేది  11/10/2024, శుక్ర  వారము.

ఉదయం :   07:00 నుండి 10:00 స్వర్ణ రధోత్సవం.

రాత్రి:  08:00 నుండి 09:00 వరకు ఆశ్వ వాహనం పై స్వామి వారి ఊరేగింపు.

బ్రహ్మోత్సవం తొమ్మిదవ రోజు: తేది  12/10/2024, శని  వారము.

వేకువఝాము: 03:00 నుండి ఉదయం :   06:00 నుండి పల్లకి ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం.

ఉదయం :   08:00 నుండి 10:00 వరకు  చక్ర స్నానం.

రాత్రి:  08:30 నుండి 10:30 వరకు ధ్వజారోహణం మరియు బ్రహ్మోత్సవం ముగింపు . 

No comments:

Post a Comment