వరలక్ష్మి వ్రతం 2026 లో ఎప్పుడు చేయాలి? వరలక్ష్మి వ్రత నియమాలు, నిబంధనల వివరాలు! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Monday, August 10, 2026

వరలక్ష్మి వ్రతం 2026 లో ఎప్పుడు చేయాలి? వరలక్ష్మి వ్రత నియమాలు, నిబంధనల వివరాలు!

 వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి ?  వరలక్ష్మి వ్రతం ఏ రోజున ఆచరించాలి ? 


శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్నచేసుకొనే పండగే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరిన్చాలో ఆ పరమశివుడు స్కందపురాణంలో పార్వతిదేవితో చెప్పి ఉన్నారు. స్త్రీలు సకల ఐశ్వర్యాలను పొందే ఏదేని వ్రతం గురించి వివరించమని పార్వతీదేవి పరమశివుని కోరన సందర్భంలో పరమశివుడు పార్వతీదేవికి తెలిపిన వ్రతమే "వరలక్ష్మివ్రతం". 

శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుతొ వచ్చే మాసము "శ్రావణ మాసం" కావటము, అందునా శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం తన దేవేరి మహాలక్ష్మిని వరలక్ష్మిగా కొలిచే వరలక్ష్మి వ్రతం శ్రీహరికి ఎంతో ప్రీతికరమైనది. అందుచే ఈరోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అష్టలక్ష్ములను పూజించిన ఫలితం దక్కుతుంది.

ముఖ్యంగా ఈ వ్రతాన్ని వివాహమైన మహిళలు తమ భర్త ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ వ్రతాన్ని ఎంతో నియమ నిశితలతో ఆచరిస్తారు. 

వరలక్ష్మి వ్రతం 2026 తేదీ (varalakshmi vratam 2026 date) :

ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు .  అనగా ఈ సంవత్సరం 2026లో ఆగస్టు నెల 28వ తారీఖున ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు . 

ఈరోజున వరలక్ష్మి వ్రాత కథతో పాటూ  రకరకాల పులా అలంకరణలతో పాటూ ,  పాలతో చేసిన పరాన్నముతో మరియు  వివిధరకాల పళ్ళని నైవేద్యంగా చూపిస్తూ వరలక్ష్మి లేదా మహాలక్ష్మి అష్టోత్తరాన్ని భక్తి శ్రద్దలతో పఠిస్తారు.

No comments:

Post a Comment