![]() |
శ్రీ రామ భక్త శ్రీ ఆంజనేయ! |
హనుమజ్జయంతి విశిష్టత : హనుమంతుని జన్మ కథ
:: హనుమాన్ జయంతి ::
రామభక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక
బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని “హనుమాన్ జయంతి”గా ఉత్సవాలు చేసుకొంటారు. భారతీయ
హిందువులే కాకుండా నేపాల్ లాంటి విదేశాల్లో కూడా విరివిగా జరుపుకుంటారు.
“హనుమాన్ జయంతి” హిందువుల పండగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమాన్ జయంతి రోజున, ఆంజనేయ స్వామి వారికి
చెప్పుకోదగ్గ భక్త బృందంలో బాలలు, బ్రహ్మచారులు, వ్యాయాయం చేసే యువకులు,
రామభక్తులు హనుమాన్ జయంతి వేడుకలు చేసుకోవటంలో ముందుంటారు.
వీరంతా సమీపంలో వున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి
హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటారు.
:: హనుమాన్ జయంతి 2024 ::
విశేషించి ఈ క్రోధి నామ సంవత్సరం మొదటి మాసమైన
“చైత్ర” మాసం “పౌర్ణమి” నాడు అనగా జూన్, 1 నాడు “హనుమాన్ జయంతి”ని
జరుపుకుంటారు. హనుమాన్ దీక్షలను కొందరు హనుమాన్ భక్తులు ఏప్రిల్ 23, 2024 నాడు మాలలు ధరించి జూన్ 1, 2024 వరకు దీక్షలను భక్తిశ్రద్దలతో కొనసాగించనున్నారు.
:: వివిధ రాష్ట్రాల్లో హనుమజ్జయంతి ::
ప్రతి ఏటా ఎంతో పవిత్రంగా జరుపుకొనే ఈ పండగ
“చైత్ర” మాసంలో “చైత్ర పౌర్ణమి”నాడు జరుపుకోవటం పరిపాటి. అయితే కొన్ని
రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో “ధను (మార్గంజి)” తమిళ మాసం
మూల నక్షత్రంలో జరుపుకోవటం గమనించతగ్గది. మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం
చైత్రమాసంలో వహ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు.
ఉత్తరాదిన హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23న జరుపుకోనుండగా, మన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశాలలో జూన్ 1, 2024న జరుపుకోనున్నారు. అలాగే కన్నడ హనుమాన్ జయంతి డిసెంబర్ 13, 2024న, తమిళులు హనుమాన్ జయంతిని డిసెంబర్ 2024, 30న జరుపుకోనున్నారు.
కొందరు హనుమాన్ భక్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో 41 రోజుల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.
:: హనుమంతుని జన్మ వృత్తాంతం ::
ఒకనాడు “అంజీర” అనబడే ఒక గొప్ప సాధువు
స్వర్గాదిపతైన ఇంద్రుడి వద్దకు వెళ్తాడు. ఇంద్రుడు తన నర్తకి తో అంజీరకు స్వగతం
పలికి నృత్యకారిణి నృత్యంతో స్వాగతిస్తాడు. భంగిమలతో చేస్తున్న నృత్యాన్ని చూడటం
ఇష్టంలేని అంజీర పరమాత్ముని ధ్యానంలో లేనమైపోతాడు.
ఈ విషయం గమనించని ఇంద్రుడు మరియు నృత్యకారిణి
నృత్యం ఎలా ఉందంటూ అన్జీరను ప్రశ్నిస్తారు. తానూ పరమాత్ముని ధ్యానంలో ఉన్న విషయం
సమాధానంగా విన్నారు ఇంద్రుడు, నృత్యకారిణి. నృత్యకారిణి అవమానంగా భావించి
నిరుత్సాహంతో అన్జీరను దుర్భాషతో
అవమానిస్తుంది.
కోపోద్రిక్తుడైన అంజీర “నీవు స్వర్గం నుంచి భూమికి
పోతావు. అడకోతివై పుట్టి కొండలపనున్న అడవుల్లో జీవిస్తావు” అని నృత్యకారిణి
శపిస్తాడు. ఆమె తక్షణమే క్షమాపణలు చెప్పి క్షమాభిక్ష వేడుకొంటుంది. శాంతించిన
అంజీర “ నీకు పరమాత్ముడిని ఆరాధించే గొప్ప భక్తుడు జన్మిస్తాడు. ఎల్లప్పుడూ
పరమాత్ముని సేవలోనే ఉంటాడని” ఉపశమనం కల్పించెను.
నృత్యకారిణి తరువాత వానర రాజైన “కుంజర”కు
కుమార్తెగా జన్మిస్తుంది. పిమ్మట కుంజర ప్రవతదీసుడైన “కేసరి” ని వివాహమాడి
మహిమాన్విత గుణ సంపననుడు, శ్రీరామ భక్తుడైన “హనుమంతుని”కి శివ, వాయుదేవుల
ఆశీస్సులతో జన్మనిచ్చింది.
హనుమంతుని తరచు వాయువు (గాలి దేవుని) కుమారుడిగా పరిగణిస్తారు.
ఇందుకు సంబంధించి వేర్వేరు పురాణగాధలు ఉన్నాయి.
పురాణాలలోని ఒక కథ ఆధారంగా, అంజనాదేవి
శివుడిని పూజించేటప్పుడు, అయోధ్య రాజు దశరదుడు కూడా పుత్రకామేష్టి యాగాన్ని చేస్తుండటం,
తత్ఫలితంగా , ప్రసాదంగా పవిత్ర పాయసం తన ముగ్గురు భార్యలతో పంచుకున్నాడు, రామ, లక్ష్మణ, భరత, మరియు శత్రుగ్న పుట్టుకలకు దారితీసింది. దైవాజ్ఞ కారణంగా, ఒక గాలిపటం ఆ పాయసం యొక్క భాగాన్ని కొల్లగొట్టి, అరణ్యంలో ఆరాధనలో ఉన్న అంజనాదేవి ఎగురుతూ వచ్చి ప్రార్ధినలోవున్న ఆమె
చేతుల్లో పడింది. ఫలితంగా హనుమంతుడు ఆమెకు జన్మించాడని వృత్తాంతం.
మరో కథ ప్రకారం అంజనాదేవి భర్త కేసరి శిశువు కోసం
శివుడిని ప్రార్ధించారు. శివుడి దర్శకత్వంలో, వాయువు తన అంశతో అంజనాదేవి గర్భం
పండేట్లు వరమిస్తాడు. దీని ప్రకారం, హనుమంతుడు వాయు
కుమారుడుగా కీర్తించబడ్డాడు.
:: హనుమంతుని స్వామి భక్తి ::
హనుమంతుడు అనంతశక్తి పరక్రమంతుడయినప్పటికీ శ్రీరాముని
సేవలో గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు.
శ్రీరాముడిని తన మనసే మందిరంగా చేసి కొలచిన హనుమంతుడు తన గుండెని చీల్చి
చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే అది హనుమంతుని స్వామి భక్తికి పరాకాష్ఠ.
సీతమ్మ నుదుట సింధూరం చూసి ఓనాడు హనుమంతుడు
ఎందుకమ్మా అలా పెట్టుకోన్నావు? అని సందేహ నివృత్తికై ప్రశ్నింపగా “శ్రీరాముని
ఆయుష్షు కోసమ”ని తెలుపిన, వెనువెంటనే హనుమంతుడు తన దేహమంతా సిందూరం పూసుకొని
“శ్రీరాముని”పై తన భక్తిప్రపత్తులకి లోకాలన్నీ విస్మయం చెందాయనే చెప్పవచ్చు.
రామనామ శబ్దం వినిపించే ప్రతిచోటా హనుమంతుడు సంచారం ఉంటుందని భక్తుల ప్రగాఢ
నమ్మకం. గ్రామాల్లో రామాలయ ప్రాంగణాల్లో కూడా ఆంజనేయ స్వామి సంచరిస్తుంటారని
గ్రామస్తుల నమ్మకం.
:: హనుమజ్జయంతి పూజా విధానం ::
భక్తి, బలం మరియు శక్తి యొక్క చిహ్నంగా ప్రజలు
హనుమంతుని ఆరాధిస్తారు. దుష్ట ఆత్మలను జయించేందుకు మరియు మనస్సుకి శాంతిని
కల్పించే సామర్థ్యాన్ని కోరుకొనే భక్తులు హనుమాన్ చాలిసాను పారాయణంగా చదువుతారు.
ఈ హనుమజ్జయంతి పవిత్ర దినాన భక్తులు తెల్లవారుఝామునే లేచి
శిరస్నానమాచరించి, గ్రామంలో వున్న ఆంజనేయ స్వామి దేవాలయను సందర్శించి, హనుమాన్
విగ్రహానికి ఎర్ర సింధూరం పూస్తారు. లడ్డూని ప్రసాదంగా సమర్పిస్తారు. కొందరు
తమలపాకుల మాలను స్వామి వారికి సమర్పిస్తారు.
పూజ చేయించిన తరువాత, తోటి భక్తులకు
ప్రసాదంగా లడ్డూలను, సిందూరాన్ని పంచుతారు. కొందరు భక్తులు హనుమజ్జయంతి పూజను దీక్ష పూని 41రోజుల పాటు నిష్టతో మండల దీక్షను చేస్తారు.
:: హనుమజ్జయంతి పూజా ఫలితాలు ::
సప్తసముద్రాలను దాటిన ధీశాలి, దశాఖంఠుడైన రావణాశురునకే
ముచ్చెమటలు పోయించిన హనుమజ్జయంతి
రోజున పూజలు చేసి, హనుమాన్ చాలీశా పారాయణం చేసిన భక్తులకు రోగ బాధలు, శత్రు పీడలు,
గ్రహ బాధలు, చెడు అలవాట్లు తొలగిపోతాయని పెద్దలమాట.
No comments:
Post a Comment