శనీశ్వర జయంతి తేదీ 2020, పూజించే విధానం !!! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Friday, May 22, 2020

శనీశ్వర జయంతి తేదీ 2020, పూజించే విధానం !!!

Shani Dev
కర్మ ఫల ప్రదాత శనీశ్వరుడు  
శనీశ్వర జయంతి  తేదీ 2020, పూజించే విధానం !!!

హిందువుల క్యాలండర్ ప్రకారం వై శాఖ శుద్ధ చతుర్దశి తరువాత వచ్ఛే అమావాస్య రోజున సూర్య పుత్రుడైన శని / శనీశ్వరుని  పుట్టిన రోజు. నిత్యం మనం చేసే కర్మల ఫల ప్రదాతగా శనీశ్వరుడు ప్రసిద్ధి గాంచిన దేవుడు. ఈయన దృష్టిమూలముగా కలుగు చెడుప్రభావాలను తగ్గించుకునేందుకు శనీశ్వరుడి కృప కొరకు ఆయనను పలువిధాలుగా పూజించడం పరిపాటి. 

జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితాలపై శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి క్లిష్టమైన దశలో శని దేవునికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనీశ్వరుని అనుగ్రహం పొందితే అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం.

శనీశ్వరుడని పూజించడం ద్వారా  కష్టాలనుండి  విముక్తి కలగడమే కాకుండా అయన శుభ దృష్టి  వలన మనసులోని కోర్కెలు కూడా   నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

శని జయంతి తేదీ 2020 :


జ్యోతిష్య శాస్త్రప్రకారం వై శాఖ శుద్ధ చతుర్దశి తరువాత వచ్ఛే అమావాస్య రోజున సూర్య పుత్రుడైన శని / శనీశ్వరుని  పుట్టిన రోజు అనగా ఈ సంవత్సరం మే 22వ తారీఖున జరుపుకొనుచున్నారు.

శని జయంతి నాడు ఆచరించాల్సిన నియమాలు :


  • తెల్లవారు  ఝామునే లేచి శిరస్నానం ఆచరించాలి. 
  • మంచి వస్త్రాలను ధరించాలి.
  • సమీపంలోని నవగ్రహాల గుడిలో శనీశ్వరునికినవరత్నాల మాలను సమర్పించాలి.
  • సమీపంలోని నవగ్రహాల గుడిలో తైలాభిషేకం చేయాలి.
  • శనీశ్వరుని స్తోత్రాన్ని తమ శక్తి కొలది పఠించాలి.
  • నలుపు వస్త్రాన్ని దానం చేయాలి.
  • శని జయంతి నాడు రోజంతా ఉపవాసం ఉంటే శనీశ్వరుని  దయకు పాత్రులౌతారు.
  • ఈరోజు పేదవారికి అన్నదానం చేస్తే శనీశ్వరుడు కృపకు పాత్రులౌతారు.
  • ఈరోజు చీమలకు బెల్లాన్ని సమర్పించాలి.
  • నల్లని శునకానికి ఆహారాన్ని పెట్టడం ద్వారా శనీశ్వరున్ని తృప్తి పరచేవారౌతారు.


శనిజయంతి నాడు చేయకూడని విషయాలు :


  • ఈరోజు ఇనుముని కొని గృహానికి తీసుకురావద్దు.
  • మద్యమాంసాదులు దూరముగా ఉండండి.
  • శనీశ్వరుని పూజలో ఎరుపు రెండు వాడొద్దని సూచని. 
  • శని జయంతి పూజలో ఎట్టిపరిస్తుతుల్లో పరధ్యాన్నం పనికి రాదు


శని మహత్యం :

శనిభగవానుని పరిహాసమాడిన విక్రమాదిత్యుడు అనేక కష్టాలను అనుభావించాడట. తన రాజ్యాన్ని పోగొట్టుకోవటమే కాకుండా దొంగగా ముద్రింహబడి పొరుగు రాజుచే కాళ్ళని చేతులను నరికించబడ్డాడట. అష్టకష్టాలను పడిన విక్రమాదిత్యుడు చివరికి శనీశ్వరుని భక్తి శ్రద్దలతో పూజించి కష్టాలనుండి విముక్తి కొరకై ప్రార్ధించాడట.  విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి విక్రమాదిత్యునకు పూర్వవైభవాన్ని ప్రాప్తిన్చడాట. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకనాడు పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోయగా వినాయకుడు జన్మించెను. ఈ సందర్భంలో  సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు, మునులు  చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి సంతోషాన్ని  కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని తెలిసి ఆ బాలగణపతి పై దృస్టి సారించలేదు. శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేకపోయిన  పార్వతీ దేవి తనకుమారుని చూడమని ఆగ్రహంతో శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా దోషపూరితుడై బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

No comments:

Post a Comment