కార్తీక మాసం 2024 ప్రారంభం ఎప్పుడు? వివరాలు, విశిష్టత, పద్ద్ధతులు! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Friday, October 25, 2024

కార్తీక మాసం 2024 ప్రారంభం ఎప్పుడు? వివరాలు, విశిష్టత, పద్ద్ధతులు!


Lord Shiva!


2024లో కార్తీకమాసం తేదీలు పాటించే విధానం!

కార్తీకమాసం :

దీపాల పండగ దీపావళి ముగిసన మరుసటి రోజు నుండి ప్రారంభమయ్యే మాసామే "కార్తీక మాసం"! శివకేశవుల ఇరువురికి ఎంతో ఇష్టమైన మాసం "కార్తీక మాసం"! నెల రోజులపాటూ ఎంతో నియమ నిష్టలతో భక్తులు కట్టుదిట్టమైన ఆచారాలను పాటిస్తూ ఆ హరిహరాదులను భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కార్తీకమాస పూజలని చేసిన వారికే కాకుండా చూసిన వారికీ కూడా మోక్షం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. దీపావళి అమావాస్య తరువాత ప్రారంభమయ్యే కార్తీక మాసం "శివుని"కి ఎంతో ప్రీతికరమైన మాసం. పురాణాల ప్రకారం 12 మాసాల్లో అత్యంత పవిత్రమైనది "కార్తీక మాసం".

" సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యధాశివమాయో విష్ణు రేవ్వం  విష్ణుమయశ్శివః
యదంతరం న పశ్యామి తదామే స్వస్తిరాయుషి."

ఈ శ్లోకం లోని అర్ధం ప్రకారం శివుడే విష్ణువని విష్ణువే శివుడని అర్ధం. శివుని హృదయంలో విష్ణువు కొలువై ఉన్నారు అలాగే విష్ణువు మనంబున శివుడే కొలువై ఉన్నందున ఎవరు అధికులని ఆలోచింపక భక్తులు శివకేశవులను తమ శక్తి కొలది పూజలాచరించి తమ జన్మ తరింపచేసుకొనే ఏకైక మాసమే "కార్తీక మాసం".

అయితే భక్తులు ఈ మాసంలో నియమ నిష్టలు ఆచరిస్తూ "కార్తీక మాసం" పూజలు చేయటం పరిపాటి. పూర్తిగా 30 రోజులు నియమ నిష్టలు ఆచరించి పూజలు చేయలేని వారు "ఏకాదశి", "ద్వాదశి", "సోమవారాలు", "కార్తీక పౌర్ణమి" రోజుల్లో పూజల్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలూ చెబుతున్న విషయం గమనార్హం!

2024 కార్తీక మాసం ప్రారంభ తేదీలు మరియు విశిష్ట దినాలు :

ఈ సంవత్సరం 2024 లో కార్తీక మాసం 01/11/2024 శనివారం  కార్తీక శుద్ధ పాఢ్యమి నుండి 02/12/2024 ది సోమా వారం మార్గశిర శుద్ధ గౌరీ పాఢ్యమి వరకు విశిష్ట దినములు.

తే 04/11/2024 మొదటి కార్తీక సోమవారం.
తే 11/11/2024 రెండవ కార్తీక సోమవారం.
తే 12/11/2024 కార్తీక శుద్ధ ఏకాదశి (బుధ వారం).
తే 15/11/2024 కార్తీక పౌర్ణమి.
తే 18/11/2024 మూడవ కార్తీక సోమవారం.
తే 25/11/2024 నాల్గవ కార్తీక సోమవారం.
తే 26/11/2024 కార్తీక బహుళ ఏకాదశి.
తే 29/11/2024 మాస శివరాత్రి.

కార్తీక మాసంలో అనుసరించాల్సిన కనీస నియమ నిబంధనలు :

  • శిరస్నానం చేయుట.
  • ఆలయ సందర్శన.
  • శాఖాహార భోజనం.
  • ఏక భుక్తం చేయుట.
  • సాయంసంధ్యల్లో దీపారాధన.
  • ప్రతిరోజూ "కార్తీక పురాణం" చదవటం లేదా వినడం.


నదీస్నానం:

కార్తీక మాసం వ్రత నియమాలలో ముఖ్యముగా చేప్పుకొన విషయాల్లో నదీస్నానం. వేకువజామునే లేచి సమీపాన ఉన్న నదిలో చాల మంది స్నానమాచరించటం తదుపరి శివకేశవుల ఆలాయాల్ని సందర్శించటం పరిపాటి. ఇలా సూర్యోదయానికి ముందు నదీస్నానం ఆచరించటం ద్వారా పారే నదిలో ఉండే అయస్కాంత శక్తి మన శరీరంలో ఉండే కొన్ని రుగ్మతల్ని తగ్గిస్తుందని సైన్స్ కూడా ధృవీకరించింది. 

దీపదానం:

ఈ మాసంలో భక్తులు టెంకాయలు, పళ్ళు, పూలతో పాటు దీపాలను కూడా దైవానికి నివదిస్తారు. భగవంతుని ముందు దీపాన్ని వేలింగించటం దీప దానం గా పేర్కొనబడింది. ఈ కార్తీకమాసం లో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం ఎన్నో యోజనాల పుణ్య ఫలం సిద్దిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే కార్తీక మాసం లో కృత్తిక నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమీ నాడు కార్తీక దీపారాధన చేస్తుంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో శివాలయం, విష్ణాలయం లేదా తులసికోట వద్ద 365 కట్ట వత్తి వెలిగిస్తే సంవత్సరం పాటు దీపారాధన చేసిన ఫలం లభిస్తుందని పెద్దల మాట.

కార్తీకపౌర్ణమి:

కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్షంలో పౌర్ణమి "కార్తీక పౌర్ణమి" గా ప్రసిద్ది గాంచింది. ఈ సంవత్సరం 2024 రాబోయే నవంబర్ 15వ తేదిన వచ్చే ఈ "కార్తీక పౌర్ణమి" నాడు భక్తులు విశేషంగా ఆలయ సందర్సన చేస్తారు. తమ శక్తి కొలది భగవారాధన చేస్తారు. ఈ రోజున శివాలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శివ అష్టోత్తరాలు, శివాభిశేకలు, శివ సహస్రనామార్చనలు, రుద్రాభిషేకలతో ఆధ్యాత్మికం మిన్నంటుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమలతో పాటు కార్తీక పౌర్ణమి పుస్తకాలను పంచుతుంటారు.

కార్తీకవనభోజనం:

సృష్టిలో వున్న చెట్లని పూజించటం పలు ప్రాంతాల్లో ఉన్నది. చెట్లని దైవాలుగా భావించటం భారతీయ సంస్కృతిలో భాగమే. తులసి, ఉసిరి, బిల్వ, వేప ఇట్లాంటి చెట్లని మనం నిత్యం పూజిస్తూనే ఉంటాం. సాక్షాత్తు మహా విష్ణువు, లక్ష్మీ దేవి సమేతంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారని ప్రతీతి. అందుకే భక్తులు ఉసిరి చెట్టు కు దీపారాధన చేస్తారని నమ్మిక. అలాగే ఉసిరి చెట్టు ఒకటైన ఉన్న తోటల్లో కార్తీక వనభోజనం జరుపుకుంటారని ప్రతీతి.

పురాణపఠనం:

ఈ విలువైన కార్తీక మాసంలో భక్తులు తమ శక్త్యానుసారం కార్తీక పురాణం ,  శివపురాణం మరియు విష్ణుపురాణం లాంటి విశిష్ట గ్రంధాల్ని పఠనం చేస్తూ సర్వ దేవతలకు ప్రీతికరమైన ఈ మాసాన్ని అనుసరిస్తుంటారని సర్వం తెలిసిన విషయమే . 
ముఖ్యముగా ఈ కార్తీక మాసంలో భక్తులు శివపురాణం, విష్ణుపురాణం, కార్తిక పురాణం లాంటి గ్రంధాలు పటించటం పరిపాటి.

1 comment: