ధనుర్మాస 2023 తేదీ, వ్రత విశిష్టత, నియమాలు మరియు ఫలితాలు! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Thursday, December 15, 2022

ధనుర్మాస 2023 తేదీ, వ్రత విశిష్టత, నియమాలు మరియు ఫలితాలు!

Sri Andal Ammavaru!

ధనుర్మాస  విశిష్టత!

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే క్రమంలో "ధనూరాశి"లో ప్రవేశించి తిరిగి "మకరరాశి"లో ప్రవేశించే వరకు మధ్య ఉన్న కాలాన్నే "ధనుర్మాసం"గా పిలువబడుతున్నది. ఈ "ధనుర్మాసం" ముఖ్యముగా ఆధ్యాత్మికముగా ముఖ్యకాలం. ఈ కాలంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి "శ్రీ మహావిష్ణువు"కు పూజిస్తారు. ఈ "ధనుర్మాసం" భగవతారాధాన మినహా మిగిలిన శుభకార్యములకు దూరముగా ఉండే కాలం. అంటే ఈ మాసములో విష్ణు ఆరాధన తప్ప ఇతర శుభాకార్యములగు వివాహాలు కాని, నూతన గృహప్రవేశములు కానీ జరుపుటకు పనికిరాదు. అనగా "శూన్యమాసం".

ఈ నెల (డిసెంబర్. 2023) 13తేది ఉదయం  గం.03.01ని.లకు ధనుర్మాసం ప్రారంభం అవుంటుంది.ఈ ధనుమాసం జనవరి2024 భోగి పండుగవరకు  కొనసాగుతుంది. ఈ ధనుర్మాసంలో(డిసెంబర్ 2023, 13వ తారీఖు నుండి)   తిరుమల శ్రీవారికి నిత్యం వినిపించే (ధనుర్మాసం మినహా) సుప్రభాతానికి బదులు తిరుప్పావై వినిపిస్తారు.

తిరుప్పావై పాశురాలు?

"తిరు " అంటే "శ్రీ" అని "పావై" అంటే "పాటలు లేదా వ్రతం" అని అర్ధం. "పాశురం" అనగా చందోబద్ధమైన పాటలు లేదా పద్యములని అర్ధము. ఈ తిరుప్పావై లో 30పాశురములు రచించబడి ఉన్నవి. ఈ తిరుప్పావై పాశురాలను "శ్రీ ఆండాళ్" ("గోదాదేవి") దేవి రచించారు. ఈ తిరుప్పావై గ్రంధం తమిళనాట విశేష ప్రజాదరణ ఆర్జించింది.

స్వామివారి అపర భక్తుల్లో ఒకడైన విష్ణుచిత్తుడు మహావిష్ణువును అర్చించే నిమిత్తం తాను పెంచుతున్న తులసివనంలో ఒక తులసి మొక్క కింద దొరికిన బిడ్డని "గోదా" అని నామకరణం చేసాడు. "గోదా" అనగా భూదేవి కానుక అని అర్ధం. ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన "శ్రీ ఆండాళ్" చివరికి విష్ణు స్వరూపుడైన "శ్రీ రంగనాధు"ని మాత్రమే వివాహమాడ స్థిర నిర్ణయం తీసుకొంది. "శ్రీరంగనాథుని" భర్తగా నిర్ణయించుకున్న "ఆండాళ్" (గోదాదేవి) స్వామివారికి సమర్పించే పూల మాలలను తానే ముందుగా ధరించిన పిదప స్వామివారికి అలంకరించేది. 30పాశురాలని రచించి స్వామికి ధనుర్మాస వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి స్వామివారినే భర్తగా పొందింది.

ధనుర్మాస వ్రతం:

ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుగోరే వారు "మహా విష్ణువు" విగ్రహాన్ని బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ చేయించుకొని ఈశాన్య భాగములో "మండపాన్ని" సిద్ధం చేసుకోవాలి. మహావిష్ణువును "మధుసూదను"గా భావించి 30తిరుప్పావై పాశురాలను పఠించాలి. అంతే కాకుండా "విష్ణు సహస్రనామ పారాయణం", "విష్ణుపురాణం"లను పఠించటంతో పాటూ విష్ణాలయ సందర్శనం మంచిదని పెద్దలు చెబుతున్నారు. తులసి దళాలతో స్వామి వారిని అర్చించటం పరిపాటి. 30 దినాల ఈ పూజలో  తొలి 15 దినాలు చక్కర పొంగలి లేదా పులగం ని, మిగిలిన 15 రోజులు దద్దోజనం ను "మధుసూదనుని"కి నైవేద్యముగా సమర్పించాలి. 

ధనుర్మాస వ్రత నియమాలు :

  • వేకువ ఝామునే నిద్ర లేవాలి.
  • శిరస్నానం ఆచరించాలి.
  • భక్తితో బ్రహ్మకాలంలోనే పూజనాచరించాలి. 
  • పంచామృతాలతో స్వామివారిని అభిషేకిస్తే మంచిది.

ధనుర్మాస వ్రత ఫలితాలు:

మహావిష్ణువు / శ్రీరంగనాధుడు / శ్రీవేంకటేశ్వరుడులను ఈ ధనుర్మాసములో "మధుసూదనుడు"గా భావించి ఈ ధనుర్మాసములో 30 రోజుల్లో కనీసం 1 రోజైన పూజించిన 1000 జన్మల పూజా ఫలం సిద్దిస్తుందని పెద్దల మాట. ఈ పూజలనాచరించే "ఆండాళ్" ఫలితంగా "స్వామి"వారినే భర్తగా పొందటంతో యువతుల్లో ఈ పూజనచారిస్తే మంచి భర్త దొరుకుతాడని నమ్మకం. అందుకే ఈ వ్రతాన్ని అవివాహిత యువతులు ఎక్కువగా ఆచరిస్తుంటారు. 

తిరుమలలో ధనుర్మాసం :

ఈ ధనుర్మాసంలో "శ్రీ మహా విష్ణువు" లేదా "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారు "మధుసూదనుడు"గా కొలువ బడతారు. ఈ ధనుర్మాసములో "తిరుమల" లో శ్రీ వెంకటేశ్వర స్వామి"కి సుప్రభాతానికి బదులు "తిరుప్పావై" వినిపిస్తారు.


తిరుమలలో మార్గశిర విష్ణు వైభవ ప్రవచనాలు :

పవిత్ర ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 2023, 13 వ తారీఖున మొదలై జనవరి 2024, 13వ తారీఖువరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయరు స్వామి మఠంలో తిరుప్పావై పారాయణ చేయుచున్నారు.


No comments:

Post a Comment