![]() |
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యరూపం! |
రథసప్తమి విశిష్టత!
హిందువుల్లో ఈ పండగ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి నాడు “రథసప్తమి” జరుపుకొంటారు. రథసప్తమి ఈ సంవత్సరం (2025) ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకొంటున్నారు. ఈ రోజే సూర్య దేవుడు జన్మించాడని, అందుకే రథసప్తమి నాడే సూర్యుని జన్మదినమైనందున “సూర్యజయంతి”గా భావించడం జరుగుతుంది.
రథసప్తమి ఎంతో పవిత్ర దినం. ఈరోజు సూర్యగ్రహణం రోజు పాటించే అన్ని ఆచారాలను భక్తులు పాటిస్తారు. అంతే కాకుండా ఈరోజు సుర్యారాధన కావించి దానధర్మలను చేసే భక్తులకు ఈ జన్మలోను, గడిచిన జన్మలలోను తెలిసీ తెలియక చేసిన తప్పులు, పాపాలు నుండి ప్రక్షాళింపపబడతారని ప్రతీతి.
రథసప్తమి నాటి నుండి వాతావరణ మార్పులు సంభవించటం పరిపాటి. నేటి నుండి సూర్య కిరణాల తేజస్సు క్రమేణా పెరగుతుండటం విశేషం.
రథసప్తమి రోజున ఆచరించవలసిన నియమాలు :
అరుణోదయ కాలంలో స్నానమాచరించాలి. ముఖ్యంగా నదుల్లో కాని చెరువుల్లో కాని స్నానమాచరిస్తే మంచిది. స్నానమాచరించే ముందు శిరస్సుపై, భుజాలపై, ఛాతీపై, తొడలపై మరియు వెన్నుపై జిల్లేడు ఆకులు వేసుకొని చేస్తే మంచిదని పెద్దల మాట. ఇలా చేయటం వలన ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. అందుకే రథసప్తమికి “ఆరోగ్యసప్తమి” అని కూడా పేరొందింది.
స్నానమాచరించిన పిదప కుటుంబ సభ్యులందరూ “సూర్యుని” కెదురుగా చేరి ఇత్తడి పాత్రలో తాజా పాలు పోసి, తగిన కొత్త బెల్లాన్ని చేర్చి మరగనిస్తారు. కుటుంబ సభ్యులలో అందరూ ఒక్కొక్కరుగా పిడికెడు బియ్యాన్ని మరిగే పాలలో వేస్తూ సుర్యదేవునికి పూజలు, ప్రార్ధనలు చేస్తారు. ఇలా ప్రత్యేక పాయసం తయారైన తరువాత సుర్యదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈరోజున ఆదిత్య హృదయం చదివి సూర్యనారాయణ స్వామిని దర్శిస్తే ఆరోగ్యభాగయములతో పటు సిరిసంపదలు కూడా దక్కుతాయని భక్తుల నమ్మకం.
అరసవల్లిలో రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి దర్సనం కొరకై ఎప్పటివలే లక్షలాదిమంది భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం కొరకు పోలీస్ వారి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు జరుగుతున్నవి. భక్తజనులందరికీ శీఘ్ర దర్శనం కొరకు పోలీసు వారు మరియు స్వచ్చంధ సంస్థలు విశిష్ట కృషి జరుపనున్నట్లు భోగట్టా.
అరసవల్లిలో రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి దర్సనం కొరకై ఎప్పటివలే లక్షలాదిమంది భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం కొరకు పోలీస్ వారి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు జరుగుతున్నవి. భక్తజనులందరికీ శీఘ్ర దర్శనం కొరకు పోలీసు వారు మరియు స్వచ్చంధ సంస్థలు విశిష్ట కృషి జరుపనున్నట్లు భోగట్టా.
No comments:
Post a Comment