నృసింహ ద్వాదశి విశిష్టత! వ్రత విధానం 2021!! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Tuesday, March 23, 2021

నృసింహ ద్వాదశి విశిష్టత! వ్రత విధానం 2021!!

 నృసింహ ద్వాదశి విశిష్టత! వ్రత విధానం 2021!


Sri Laxmi Narasimha Swamy
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి!

ద్వాదశి అంటే?

సంస్కృతంలో ద్వాదశి అంటే 12 అని అర్ధం. అంటే 12వ దినం అని. ఈ ద్వాదశులు కృష్ణపక్షం  ఒకటి మరియు శుక్లపక్షం ఒకటి  ప్రతినెలలో వస్తాయి. కాబట్టి ఈ ద్వాదశులు సంవత్సరాయికి 12 కృష్ణపక్షం ద్వాదశులు మరియు 12 శుక్లపక్షం ద్వాదశులు వస్తాయి.

ఈ ద్వాదశులనాడు వివిధ  విష్ణు అవతారాలను పూజిస్తారు.

నృసింహ ద్వాదశి అంటే?

అయితే ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాడు నరసింహ అవతారంలో ఉన్న విష్ణు రూపాన్ని పూజిస్తారు కనుక ఈ ద్వాదశిని నరసింహ ద్వాదశి పిలువబడుతుంది.సహజంగా నరసింహ ద్వాదశి హోలీ పండగ ముందు వస్తుర్నది.

నృసింహద్వాదశి తేదీ? 

ఈ సంవత్సరం నృసింహ ద్వాదశి 25/03/2021 న జరుపుకుంటారు.

నృసింహ ద్వాదశి విశిష్టత! 

నరసింహ స్వామి ఎవరైతే నరసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని పండితుల మాట. ఈ వ్రతమాచరించే భక్తులకు స్వామివారు ధైర్యాన్ని,  నమ్మకాన్ని మరియు భద్రతను కల్పిస్తారని నమ్మకం. అందుచే భక్తులు నరసింహస్వామి రోజంతా ఉపవాసముండి, స్వామివారి శ్లోకాలు వళ్ళిస్తూ ధ్యానము చేసి విశేషంగా లబ్ది పొందుతారు.

నృసింహ ద్వాదశి వ్రత విధానం :

  • వేకువఝామునే నిద్రలేవాలి.
  • పారే నదిలో లేదా చెరువులో కానీ లేదా నూతి వద్దకాని శిరస్నానమాచరించటం మంచిది. పారే నదిలో స్నానమాచరిస్తే దేహశుద్ది జరుగుతుందని పూజపై మనస్సు లగ్నమవుతుందని పెద్దలమాట.
  • నరసింహస్వామి దేవాలయంలో కానీ లేదా ఇంటివద్ద పటం వద్దకాని వివిధరకాల పూలు, పండ్లు ఉంచి నరసింహస్వామి శ్లోకాలను భక్తి శ్రద్దలతో చదువుతూ  పూజ చేయాలి.
  • నరసింహ స్వామివారికి తులసిమాలతో అలంకరించి, వడపప్పు, పానకం నైవేద్యంగా.సమర్పించాలి. 
  • కనీసం "ఓం నమో నృసింహయ నమః" అని 108 సార్లు స్వామి వారిని ధ్యానించి విశేష ఫలితం లభిస్తుంది.
  • "నరసింహయ్య విద్మహే, వజ్రనఖాయ ధీమహి తనః సింహః ప్రచోదయాత్" అని నరసింహాగాయత్రిని జపించిన  మంచి జరుగుతుంది.
  • "ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖం|  నృసింహం భీషణం భద్రం||  మృత్యోర్ మృత్యుమ్ నమామ్యహం|||" ఈ మంత్రాన్ని జపిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
  • అలాగే ఈరోజు శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రాన్ని, నరసింహ అష్టోత్తరాన్ని, నరసింహ సహస్రనామాలను  పఠిస్తే చాలామంచిదని పురాణాలూ చెబుతున్నవి.
శ్రీ లక్ష్మినరసింహ దేవాలయం, సింహాచలం దివ్యక్షేత్రం దర్శించిన చరిత్ర తెలుసుకున్నా విశేష ఫలసిద్ధి లభిస్తుంది. పై లింకుపై క్లిక్ చేసి స్వామివారి చరిత్ర మరింత తెలుసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

No comments:

Post a Comment