“డాలర్” ఈపేరు విన్నప్పుడల్లా
“డాలర్” శేషాద్రి గుర్తుకు రాక మానరు. ఆ రోజుల్లో ఆయన పేరు మరుమ్రోగుతున్దేంది. శ్రీ
వేంకటేశ్వరుని బొక్కసం(treasury లేదా vault) లో నుండి ౩౦౦ డాలర్లు ఒక్కోటి
5గ్రాములు అంటే మొత్తంగా 1500 గ్రాములు విలువచేసిన శ్రీవారి బంగారు నాణేలు జూన్
నెల 2006లో మాయంకావటం పెను సంచలనమే. అప్పట్లో
దీని విలువ రూ|| 15 లక్షలు. శ్రీ “డాలర్ శేషాద్రి” ఆరోజుల్లో బొక్కసం గుమస్తాగా
ఉండేవారు. డ్యూటీలో షిఫ్ట్ సమయంలో సహోద్యోగి శ్రీ.వెంకటాచలపతికి 1500 గ్రాములు
విలువచేసిన శ్రీవారి బంగారు నాణేలు అప్పగించటం అవి మాయం కావటం సంచలనానికి
కేంద్రబిందువయ్యింది.
శ్రీశేషాద్రి మరియు శ్రీవేంకటాచలపతి
డాలర్ రిజిస్టర్ లో బంగారు నాణేలు ఇచ్చిపుచ్చుకున్నట్లు సంతకాలు నమోదు కావటంతో
అప్పటి తి.తి.దే.ఉప కార్యనిర్వాహక అధికారి శ్రీ ప్రభాకర్ రెడ్డి తిరుమల పోలీసులకిచ్చిన
ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. తదుపరి విచారణ నత్తనడకలా కొనసాగటంతో కేసు
సి.బి.సి.ఐ.డి.కి అప్పగించబడింది.
విచారణలో భాగంగా నార్కోటిక్
మరియు బ్రెయిన్ మాపింగ్ పరిక్షలలో శ్రీ వేంకటాచలపతి డాలర్లు తిరుమల బయట అమ్మకం
చేసినట్లు అంగికరించటంతో మూడేళ్ళ జైలు
శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించబడింది.
.
ఈ కేసులో కొందరు సీనియర్
ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన తి.తి,దే., శ్రీ డాలర్ శేషాద్రిని కోర్ట్ ముఖ్య
సాక్షిగానే పరిగణించినప్పటికీ విధుల్లోంచి తొలగించింది.
ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
మరిన్ని తీవ్రక్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉపసంహరించుకొంటున్నట్లు అందుకు
సంబంధించిన జి.ఓ.లను శుక్రవారమే విడుదల చేసింది. తద్వారా శ్రీ “డాలర్ శేషాద్రి”కి
ఉపసమనం దొరికినట్లైంది.
No comments:
Post a Comment