అధ్యక్షుడు ట్రంప్ దీపావళి సంబరం!
శ్వేత సౌధంలో ప్రవాస భారతీయ ప్రముఖుల నడుమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి దీపావళి వేడుకలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తో తనకు గల ప్రత్యెక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద ప్రజాస్వామిక వ్య్వవస్థ కలిగిన భారతదేశమంటే తనకు ఎనలేని గౌరవమని ఈ సందర్భంగా కొనియాడారు. పలు రంగాల్లో భారతీయ అమెరికన్ల ప్రతిభని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. శ్వేతసౌధంలో జరిగిన దీపావళి వేడుకల వీడియొ క్లిప్పింగ్‌ని తన పేస్ బుక్ ఖాతాలో అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ పెట్టారు. దీపావళి పండగ సందర్భంగా భారతీయ ప్రజలను తల్చుకున్తున్నట్లు ట్రంప్ పోస్ట్ చేసారు. ఈ వేడుకల్లో ట్రంప్ కుమార్తె ఇవంకా కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు.
No comments:
Post a Comment