దేశంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమయ్యాయి. మన హైదరాబాద్ లో చిన్న చిన్న విగ్రహలనుంది ప్రసిద్ది చెందినా ఖైరతాబాద్ భారీ గణపతి వరకు నిమజ్జనానికి సిద్ధమై ఉన్నాయి. చిన్న పిల్లలనుండి నడివయసు వారి వరకు అందరు డాన్సులు చేస్తూ అత్యంత భక్తిశ్రద్దలతో కేరింతలతో ఎంతో కోలాహలంగా సాగుతున్నాయి. తొలుత లడ్డూ వేలంపాటలు ఘనంగా జరిగాయి. బాలాపూర్ లడ్డూ అత్యధికంగా 15.60 లక్షలకు అమ్ముడు పోయి గతంలో కంటే 95వేల రూపాయలు అధికంగా ఆర్జించి పెట్టి గత రికార్డ్లను తుడిచిపెట్టింది. ఇప్పటివరకు జరుగుతున్న యాత్ర ఎంతో పకడ్బందిగా సుమారు 26వేల మంది పోలీసు బలగాల పర్యవేక్షణలో కొనసాగుతోంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని శోభయాత్రలో ఎవరికీ ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోందని ప్రజాభిప్రాయం. శోభయాత్రలో పాల్గొంటున్న వాళ్ళు సంతోషంగా నిమజ్జనోత్సవం జరుపుకోవాలని మనం కూడా ఆశిద్దాం.
Tuesday, September 5, 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment