![]() |
రాష్టపతి శ్రీ రామనాద్ కోవింద్ |
ఈరోజు మన కొత్త రాష్ట్రపతి శ్రీ రామనాద్ కోవింద్ తెలుగు రాష్ట్రమైన “ఆంధ్ర ప్రదేశ్”లో పర్యటిస్తున్నారు. శ్రీ రామనాద్ కోవింద్ గారు తొలిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించనున్నారు. ఇటీవలే భారత గణ తంత్ర దేశానికి కొత్త రాష్టపతిగా ఎంపికైన శ్రీ రామనాద్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శించేందుకై రావడం సంతోషదాయకం. రాష్ట్రపతి పర్యటన సెప్టెంబర్ 1, 2 తేదీలు కొనసాగానున్నాయ్. రాష్ట్రపతిని స్వాగతించేందుకు తెలుగు రెండు రాష్టలైన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్లకు గవర్నర్ శ్రీ నరసింహన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్లు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి శ్రీ కోవింద్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం చేయనున్నది. అంతే కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల మరియు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభింప చేయనున్నారు. అలాగే రాష్ట్రపతి కోవింద్ “డా||బి.అర్.అంబేద్కర్ నైపుణ్య శిక్షనాభివృద్ధి సంస్థ”కు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా శ్రీ కోవింద్ “స్టాండ్-అప్ ఇండియా” కార్యక్రమం లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణి చేయనున్నారు.
No comments:
Post a Comment