చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ? ఎలా చేయాలి ? చాతుర్మాస వ్రత నియమాలు? 2026 లో ఎప్పటి నుండి ఇప్పటివరకు చేయాలి? - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Saturday, July 11, 2026

చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ? ఎలా చేయాలి ? చాతుర్మాస వ్రత నియమాలు? 2026 లో ఎప్పటి నుండి ఇప్పటివరకు చేయాలి?

శ్రీ మహా విష్ణువు గూగుల్ జెమినీ చిత్రం 

చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఎలా చేయాలి ?  చాతుర్మాస వ్రత నియమాలు? 2026 లో ఎప్పటి నుండి ఎప్పటివరకు చేయాలి? 


చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ? ఎలా చేయాలి ?  

శ్రీ మహావిష్ణువు నిద్రించే యోగ కాలన్నే చాతుర్మాసం అంటారు .  చాతుర్మాసమంటే ఆషాడం ,  శ్రావణం, భాద్రపద మరియు కార్తీకం .  ఈ చాతుర్మాసాలాలో వచ్చే ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి .   శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తారు .  ఈ నాలుగు మాసాల కాలాన్ని  చేసే వ్రతాన్ని చాతుర్మాస వ్రతమని వర్ణన . 


ఈ చాతుర్మాస వ్రతాన్ని ఋషులు, పీఠాధిపతులు ,  మఠాధిపతులు ,  సన్యాసులు, విద్యార్థులు ,  గృహస్తులు ఎంతో భక్తితో నియామనిష్టలకు లోబడి ఆచరించే వారు . ఈ చాతుర్మాస వ్రతం యుగయుగాలుగా ఆచరణలో ఉందని పురాణాలు తెలియచేస్తున్నాయి . 


చాతుర్మాస వ్రతంలో ఆహార నియమాలు ఏమిటి ? 

  • ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని కఠిన ఆహార నియమాలను  ఆచరించాలి .  
  • మొదటి నెలలో ఆకుకూరలను, కాయగూరలను తినకూడదు . 
  • రెండవ నెలలో మజ్జిగ , పెరుగులను త్యజించాలి . 
  • మూడవనెలలో పలు తీసుకోకూడదు . 
  • నాల్గవ నెలలో పప్పుడు దినుసులను త్యజించాలి .  
  • ఈ చాతుర్మాసాలలో ఎర్రావుల్లి ,  తెల్లఉల్లి లేని ఆహారాన్ని భుజించాలి . 


చాతుర్మాస వ్రత నియమాలు? 

  • ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు ఈ క్రింది నియమనిష్ఠలు ఆచరించాలి . 
  • సూర్యోదయానికి ముందే నిద్రలేచి తమకి అందుబాటులో ఉంటే నదీ స్నానం లేదంటే చెరువు లేదా నూతి వద్ద శిరస్నానం ఆచరించాలి . 
  • నిత్యం మహావిష్ణువును స్మరించాలి మరియు విష్ణు సహస్రా నామాల్ని ప్రయాణం చేయాలి .  ఆంతే కాకుండా భగవత్గీతను పఠించాలి . 
  • రోజూ తులసి కోటను పూజించి సాయంకాలం ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. 
  • శాఖాహారం మాత్రమే తీసుకోవాలి . బ్రహ్మచర్యం , ఒంటి పూట భోజనం ,  భూశయనం తప్పక ఆచరించాలి . 
  • ఈ నాలుగు నెలల కాలంలో ఉరి పొలిమేర దాటి ఎటువంటి ప్రయాణాలు చెయ్యరాదు.


చాతుర్మాస వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు?

ఈ చాతుర్మాస వ్రతానికున్న నియమనిబంధనల్ని ఆచరించగలిగే వారెవరైనా లింగ బేధం, జాతి బేధం లేకుండా ఎవరైనా ఆచరించ వచ్చు .  అయితే ఈ కఠిన నియమాల్ని ఆచరించే వ్యక్తులు కాలానుగుణంగా తగ్గి పోయినందున పీఠాధిపతులు ,  యోగులు మరియు సన్యాసులు మాత్రమే ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు .  అయితే గృహస్తుల్లో కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించాలనే ఉత్సాహం అక్కడక్కడా కనిపిస్తోంది .


2026 లో ఎప్పటి నుండి ఇప్పటివరకు చేయాలి? 

ఈ చాతుర్మాస వ్రతం 2026  జులై నెల 25 న అనగా దేవశయన ఏకాదశి నాడు ప్రారంభమై 2026బి నవంబర్ నెల 20వ తారీఖు అనగా దేవుత్తానా ఏకాదశి నాడు ముగియనున్నాయి .  అనగా శ్రీ మహా విష్ణువు  దేవశయన ఏకాదశి నాడు నిద్రకుపక్రమించి దేవుత్తానా ఏకాదశి నాడు మేల్కొంటారు .  ఈ చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువును ఎన్నో నియమనిబంధనలను ఆచరిస్తూ స్వామి వారిని ఆరాధించి శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులవుతారు . 


విజ్ఞప్తి : పై వ్యాసాన్ని అంతర్జాలంలో లభిస్తున్న ఇతర వ్యాసాలనుండి స్ఫూర్తి పొంది పాఠకుల సౌకర్యార్ధం రచించడం జరిగింది .  పై వ్యాసంలోని విషయాలను పాఠకులు తమ స్వంత విజ్ఞత మేరకు ధృవీకరించుకోవాల్సిందిగా ప్రార్ధించడమైనది .  వ్యాసంలోని తప్పుఒప్పులకు రచయిత లేదా దివ్యక్షేత్రం యాజమాన్యం బాధ్యత వహించదని వినయపూర్వకంగా తెలియచేయడమైనది . 

No comments:

Post a Comment